calender_icon.png 28 October, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర

28-10-2025 08:55:10 AM

వెంకటాయపల్లి లో సీసీ కెమెరాలను ప్రారంభించిన డి.ఎస్.పి నరేందర్ గౌడ్.

తూప్రాన్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం(Toopran Mandal) వెంకటాయపల్లి గ్రామంలో 12 సీసీ కెమెరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సూది వెంకట్ రెడ్డి గ్రామ శ్రేయస్సు కోసం తన సొంత నిధులతో కెమరాలను ఏర్పాటు చేసి డీఎస్పీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకున్న తక్షణమే సీసీలో రికార్డు అవుతాయని తెలుపుతూ ముష్కరుల ఆచూకీ లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివనందం, మండల బిఆర్ఎస్ నాయకులు లంబ రమేష్, దేవత ల్యాగయ్య, శ్రీకాంత్, గౌడ శ్రీను, చాకలి రాజు, పుట్ట సత్యనారాయణ, నర్సింలు, సి హెచ్ వెంకటేష్ గౌడ్, పెద్దకుర్మ స్వామి, కొంతం గణేష్ గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.