calender_icon.png 28 October, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్‌మఠ్‌లో ప్రత్యేక పూజలు.. విధుశేఖర భారతీ స్వామినీ కలిసిన రేవంత్ రెడ్డి

28-10-2025 12:47:31 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. “ధర్మ విజయ యాత్ర”లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి(Sri Vidhushekhara Bharathi Swamiji) వారికి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి జగద్గురువుకు వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు.