08-12-2025 12:43:24 AM
హైదరాబాద్, డిసెంబర్ ౭(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు) తమ బ్యాంక్ ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజడ్‌హెచ్, హైదరాబాద్ ఎంవీఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి తమ బ్యాంక్‌లో పొదుపు చేసు కునే సౌలభ్యం, రుణాలు అందజేయడం లాంటి సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం సెంట్రల్ బ్యాంక్ జోనల్ హెడ్ ధారాసింగ్ నాయక్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్ట్రీ(ఎస్‌ఈఆర్‌పీ), తెలంగాణ సీఈఓ దివ్య దేవ రాజన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.