calender_icon.png 6 December, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్‌

06-12-2025 01:42:39 PM

న్యూఢిల్లీ: విమాన టికెట్ల ధరల పెంపుపై(Flight Ticket Prices Increase) కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. టికెట్ల ధరల నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కరోనా సమయంలో(Corona time) మాదిరిగానే ఇప్పుడు కూడా నియంత్రించాలని నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో వివిధ రూట్లలో ధరల నిర్ణయాన్ని పౌరవిమానయాన శాఖ వెల్లడించనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) డీజీసీఏ అధికారులు, పలు విమానయాన సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. విమాన ధరల అడ్డుగోలు పెంపుపై విమానయానశాఖ జోక్యం చేసుకుంది.

ఇండిగో వివాదాన్ని ఆసరగా చేసుకుని ఛార్జీలపెంపుపై కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సర్వీసుల రద్దయిన రూట్లలో విమాన ప్రయాణ ఛార్జీలు క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని విమానయానశాఖ(Ministry of Civil Aviation of India) హెచ్చరించింది. ఈ మేరకు విమానయానశాఖ అన్ని విమాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని కేంద్రం సూచించింది. ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదోరోజు ఇండిగో విమాన సేవలకు అంతరాయం(IndiGo flight services disrupted) కలిగింది.

విమాన ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం అధికారులు విజ్జప్తి చేశారు. ఢిల్లీ నుంనచి విమానాల రాకపోకల్లో ఇబ్బంది లేకుండా చూస్తామని వెల్లడించింది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది పేర్కొన్నారు. విమానాశ్రయాలకు వెళ్తేముందు లేటెస్ట్ ప్లైట్ స్టేటస్ చూసుకోవాలని విజ్జప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఓపిక పట్టాలని, సహకరించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు కోరారు. అదనపు వివరాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టు వెబ్ సైట్ చూడాలని కోరారు.