13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్

27-03-2026 12:17 PM

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన కేంద్రం

పెట్రోల్‌ లీటర్‌పై రూ.13 నుంచి రూ.3కు తగ్గింపు

డీజిల్‌పై లీటర్‌కు రూ.10 నుంచి సున్నాకు తగ్గింపు

న్యూఢిల్లీ: చమురు కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం(Excise Duty) రూ. 10 తగ్గించింది. పెట్రోలో పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 13 నుంచి రూ. 3 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 10 తగ్గింపుతో డీజిల్ పై ఎక్సైజ్ సుంకం సున్నాకు చేరింది. ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చమురు సంస్థలపై భారం తగ్గనుంది. పశ్చిమాసియాలో యుద్ధం(West Asian War) వల్ల చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యుద్ధం వల్ల నెలరోజుల్లో అంతర్జాతీయ చమురు ధరలు 50 శాతం పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్(Barrel of Brent Crude Oil) ధర వంద డాలర్ల మార్క్ దాటింది. కేంద్ర నిర్ణయంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.