27 March, 2026 | 2:51 AM

నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ

27-03-2026 01:04 AM
  1. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
  2. పశ్చిమాసియా యుద్ధం, స్ఫూర్తితో సంక్షోభంపై చర్చ
  3. కేంద్రంతో కలిసి టీమ్ ఇండియా పనిచేయాలని ఇటీవల పిలుపు నిచ్చిన మోదీ 

న్యూఢిల్లీ, మార్చి 26: గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌ల మధ్య యుద్దం కారణంగా స్ఫూర్తి తో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగించిన ప్రధా ని నరేంద్ర మోదీ యుద్ధం ప్రపంచ వ్యాప్తం గా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయని, ఇది మనకు పరీక్షా సమయేమనని పేర్కొన్నారు.

సంక్షో భం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమ్ ఇండియాలా పనిచేయాలని మోదీ పిలుపు నిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం గా ఉండాలన్నారు.ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాలిత ప్రాంతాల సీఎంలతో చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం కావడం పాధాన్యత సంతరించుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. యుద్ధానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటిం చినప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంతోపాటు భార త్‌ను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.దేశంలో చమురు కొరత సహా అనేక సమస్యలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మోదీ చర్చిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, తగిన ప్రణాళికలు రూ పొందించడం, సరఫరా మార్గాలు, చమురు భద్రత, విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, అం తర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక స్థిరత్వం సాధించడంపై సమావేశం ఉంటుంది.

అయితే, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి దూరంగా ఉంటారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లు ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్రం తీసుకోబోయే చర్యలను అధికారులకు వివరిస్తారు. దేశంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.