24 June, 2026 | 2:42 PM

Breaking News

జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •  

సెంచరీల మోత రంజీ ట్రోఫీ

07-11-2024 12:12 AM

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా మూడో రౌండ్ మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు అయ్యర్ (152*) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జమ్ముతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ 73 పరుగులకే చాపచుట్టేసింది.  ఆకిబ్ నబీ, ముస్తాక్ చెరి ఐదు వికెట్లతో చెలరేగారు. వివిధ జట్ల ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు. ఉత్తరాఖండ్ ఆటగాడు ప్రియాంషు (107*), మధ్యప్రదేశ్ ఆటగాళ్లు కెప్టెన్ శుభమ్ శర్మ (134*), వెంకటేశ్ అయ్యర్ (118*), ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ (121), బెంగాల్ కెప్టెన్ మజుందార్  (101), ముంబైలో అయ్యర్ (152*), సిద్దేశ్ లాడ్ (116*) సెంచరీల మోత మోగించారు.