15 March, 2026 | 6:21 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

నంబర్‌వన్ సబలెంకా

07-11-2024 12:18 AM

రియాద్: టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నంబర్‌వన్ ర్యాంకులోకి దూసుకొచ్చింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో భాగంగా ప్రస్తుత నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ అమెరికా స్టార్ కోకో గాఫ్ చేతిలో ఓటమి చవిచూడడంతో సబలెంకా ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంకుతో ముగించనుంది. గతేడాది సబలెంకా ఈ ఫీట్ సాధించినప్పటికీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను స్వియాటెక్ సొంతం చేసుకొని మరోసారి నంబర్‌వన్ ర్యాంకు అందుకుంది.

తాజాగా రియాద్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో పర్పుల్ గ్రూప్‌లో ఉన్న సబెలంకా 2 ఆధిక్యంలో ఉంది. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)కు అమెరికా స్టార్ కోకో గాఫ్ షాకిచ్చింది. మంగళవారం ఆరెంజ్ గ్రూప్‌లో భాగంగా గాఫ్ 6 6 స్వియాటెక్‌ను చిత్తు చేసింది. ఈ ఇద్దరు 13 సార్లు తలపడగా.. స్వియాటెక్‌పై గాఫ్‌కు ఇది రెండో విజయం మాత్రమే. మరో మ్యాచ్‌లో క్రెజికోవా 6 6 జెస్సికా పెగులాపై విజయం సాధించింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల టాప్ ఆటగాళ్లు మాత్రమే అమీతుమీ తేల్చుకుంటారు.