15 August, 2026 | 3:30 PM

వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన నగర మేయర్

15-08-2026 02:46 PM

ముకరంపుర, ఆగస్టు 15(విజయ క్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మినీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌ లో నిర్వహించిన వనమహోత్సవ బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మొక్కలు నాటడం జరిగిందని నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడె వనమహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సువార్త , స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ , నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, కాలనీ వాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.