calender_icon.png 11 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25న గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన

11-11-2025 12:00:00 AM

టీఎన్జీవోల ఆధ్వర్యంలో సదస్సు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా తెలంగాణ ఎన్‌జివోల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యవర్గం గత రెండేళ్లుగా ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అర్హత కలిగిన నిపుణులైన డాక్టర్లు పాల్గొని మహిళా ఉద్యోగులకు గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్సపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. మహిళా ఉద్యోగులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రి నుండి మొబైల్ టెస్టింగ్ వ్యాన్ను సాంకేతిక నిపుణులతో సహా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం కోసం సోమవారం టిఎన్‌జివోల సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్య దర్శి డా ఎస్‌ఎం ముజీబ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్‌తో కలిసి ఎంఎన్‌జె క్యాన్స ర్ హాస్పిటల్ డైరెక్టర్‌ను కలిసి అవగాహన తరగతి, మొబైల్ టెస్టింగ్ వ్యాన్, టెక్నీషియన్ల ఏర్పాటుకు వినతిపత్రం అందజేశారు.  ఈ శిబిరానికి మంత్రి సీతక్క, కలెక్టర్‌ను, పలువురు ప్రముఖ మహిళా ఐఎఎస్ అధికా రులను ఆహ్వానించడానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి.