1 July, 2026 | 6:20 PM

Breaking News

సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •   మెరుగైన వైద్యం అందించాలి   •   ధర్మారంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ   •   గ్రామ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం   •  

పదోన్నతిపై వాంకిడి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సిహెచ్ తిరుపతి

01-07-2026 05:34 PM

వాంకిడి,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల, వాంకిడి ప్రిన్సిపాల్‌గా సిహెచ్ తిరుపతి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సిర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన పదోన్నతిపై వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీఐఓ రాందాస్ పాల్గొని సిహెచ్ తిరుపతికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డీఐఓ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ సిహెచ్ తిరుపతి మాట్లాడుతూ...ఉపన్యాసకులు, ఉపన్యాసేతర సిబ్బంది సహకారంతో కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ఉపన్యాసకులు, ఉపన్యాసేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.