4 April, 2026 | 9:29 PM

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ బండారు

04-04-2026 07:35 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): శనివారం సాయంత్రం మధిర మార్కెట్ యాడ్ నందు పిఎసిఎస్ మధిర ఆధ్వర్యంలో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతో కలిసి మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభించినారు.

అనంతరం చైర్మన్ బండారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాటకు కట్టుబడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందన్నారు.