విప్లవాగ్ని వీరనారి చాకలి ఐలమ్మ
26-09-2026 | 11:55am
వరంగల్, (విజయక్రాంతి): దోపిడి పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి నాటి నైజాం సర్కారుకు వ్యతిరేకంగా విప్లవాగ్ని రగిలించిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma) అంటూ పలువురు కొనియాడారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి సందర్బంగా హనుమకొండ న్యూ శాయంపేట లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి( Nayini Rajender Reddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు(K.R. Nagaraju), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్(Collector Chahat Bajpai), సత్య శారదతో కలసి పూల మాల వేసి నివాళులు అర్పించారు.