02-02-2026 12:50:36 AM
సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 1: మునుగోడు నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తానున్నానంటూ భరోసానిచ్చే ఏకైక నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అని మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం దామెరలోని క్యాంపు ఆఫీసులో అభిమానులు కార్యకర్తల సమక్షంలో చలమల్ల కృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు.
జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానులు కృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు.కార్యకర్తల శ్రేయస్సుకోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని తనను నమ్మిన కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్బర్ అలీ,రాసమల్ల యాదయ్య, చిలువేరు నరసింహ,బైకని నరేందర్ యాదవ్,చెక్క నరసింహ,అంతటి స్వామి, అబ్బగోని వంశి,చిలువేరు జున్ను, నోముల నాగరాజు, దుర్గం ముత్యాలు, సుర్విముత్యాలు,మినుగు గోపాలు,నరసింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.