calender_icon.png 2 February, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వవిద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం

02-02-2026 12:51:46 AM

హుజూర్ నగర్, ఫిబ్రవరి 1: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో అనే రీతిలో 1974-75 బ్యాచ్ 50 సంవత్సరాల (స్వర్ణోత్సవ) సమ్మేళనమును పట్టణంలోని పద్మశాలి భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఆప్యాయతగా పలకరించుకుంటూ అలనాటి సంఘటనలు నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ బ్యాచ్ లోనే మరణించిన తమ స్నేహితులకు నివాళులు అర్పించారు.

తదుపరి పూర్వ విద్యార్థులంతా కలిసి ఫోటోలు దిగి వాటిని పంచుకొని మధుర జ్ఞాపకంగా దాచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయ బృందం అరవపల్లి రంగారావు, అంకతి అప్పయ్య, నారాయణం రఘునాథ్, స్వయం పాకుల వెంకటేశ్వర శాస్త్రి, సారగండ్ల సత్తయ్య, ఉల్లెందుల మంగయ్య, పూర్వ విద్యార్థులు  పాల్గొన్నారు.