calender_icon.png 2 February, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే బ్రిడ్జి సాధన కోసం కదం తొక్కిన యువత

02-02-2026 12:49:02 AM

యువత నల్ల చొక్కలు ధరించి భారీ ర్యాలీ, నిరసన

ఘట్ కేసర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలంటూ యువత నల్ల చొక్కాలు ధరించి పట్టణంలో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే గేటు వద్ద భైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఘట్ కేసర్ లో నిర్మిస్తున్న బ్రిడ్జిని అడ్డుపెట్టుకొని గత 17 ఏళ్ళుగా రాజకీయ నాయకులు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉధ్యమ స్ఫూర్తితో ఆదివారం కదం తొక్కిన యువత రాజకీయ నాయకులు గట్టి హెచ్చరికలు చేశారు.

బ్రిడ్జి కాంట్రాక్టర్ సత్తిరెడ్డి నిర్మాణాన్ని నత్తనడకన సాగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు చేశారు. యువత అంటే ఏమిటో చూపిస్తామని, పెద్ద ఎత్తున నినాధాలు చేస్తు ర్యాలీ నిర్వహించడం ప్రజలకు ఆసక్తి రేకెత్తించిందని చెప్పవచ్చును. యువత కదం తొక్కడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి పోలీసులు బందోబస్తీ ఏర్పాటు చేశారు. యువత ఇన్నాళ్ళకు చైతన్య వంతులుగా బ్రిడ్జి సాధనకు ముందకు రావడం మంచి పరిణామం అయినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా ఎంతవరకు  పోరాటం సాగించగలరు అనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.