జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం
సనత్‌నగర్,(విజయక్రాంతి): వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని జెక్ కాలనీలోని SVSS నివాస్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం సొసైటీ అధ్యక్షుడు కె.సురేష్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక బాధ్యతగా ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాబోయే మూడు నెలల పాటు నిరంతరాయంగా ఈ కేంద్రం ద్వారా బాటసారులకు, స్థానికులకు చల్లని తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఈ సదుపాయాన్నివినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్. వై. సంపత్ కుమార్, ఖజాంచి వి. తిరుపతి రెడ్డి, సభ్యులు కె. రాజేంద్ర, కె.శ్రీను, సరాఫ్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సిబ్బందిలో సూపర్వైజర్ గణేష్, సురేందర్ తదితరులు హాజరయ్యారు.




