తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత
11-04-2026 05:01 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన స్వర్గీయ దాసోహం సరోజన గత నెల 5న అనారోగ్యంతో మృతి చెందగా, సరోజన కుమారులు దాసోహం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అనిల్, సంతోష్. కుటుంబ సభ్యులు మనవళ్లు మనవరాలు బంధుమిత్రులు కలసి మున్సిపల్ కార్మికులకు శనివారం టిఫిన్ బాక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్నేహితులు జూపాక కుమారస్వామి పలువురు పాల్గొన్నారు.




