28 June, 2026 | 1:04 AM

టీ9 చాలెంజ్ గోల్ఫ్ విజేత బంకర్ బస్టర్స్

28-06-2026 12:00 AM

గచ్చిబౌలీ, జూన్ 27: టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ నాలుగో సీజన్‌లో బంకర్ బస్ట ర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు టైటి ల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో బంకర్ బస్టర్స్ 4.5-3.5 స్కోర్‌తో దాసోస్ బై మహి జట్టుపై విజయం సాధించింది. తొలి సెషన్ లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. సెకండ్ సెషన్‌లో దాసోస్ టీమ్ పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

18వ హోల్ వరకూ పోటీ సాగినప్పటకీ చివరికి బంకర్ బస్టర్స్ విజయాన్ని అందుకుంది. రెండు వారాల పాటు సాగిన ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొన్నాయి. డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చా ముండేశ్వర్ నాథ్ ముఖ్యఅతిథులుగా హాజ రై విజేతలకు ట్రోఫీలు అందించారు. చాంపియన్‌గా నిలిచిన బంకర్ బస్టర్స్‌కు రూ.5 లక్ష ల ప్రైజ్ మనీ లభించింది. కాగా టీ20 క్రికెట్ తరహాలో గోల్ఫ్‌లో కూడా 9 హోల్ ఫార్మా ట్‌లో నిర్వహిస్తుండడంతోనే మంచి స్పంద న వచ్చిందని టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు.