28 June, 2026 | 1:04 AM

కేప్ వెర్డె సంచలనం

28-06-2026 12:00 AM

తొలిసారి నాకౌట్‌కు క్వాలిఫై

హూస్టన్, జూన్ 27 : ఫిఫా ప్రపంచకప్ లో సంచలనం నమోదైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కేప్ వెర్డె అనూహ్య రీతిలో నాకౌట్లోనూ అడుగుపెట్టింది. ఒక్క మ్యాలోనూ విజయం సాధించ కుండానే కేప్ వెర్డే తదుపరి దశకు చేరుకుంది. స్పెయిన్‌తో మ్యాచ్‌ను, ఉరుగ్వేతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

తాజాగా లీగ్ దశ లో ఆఖరిగా సౌదీ అరేబియాతో హూస్టన్ వేదికగా తలపడ్డ కేప్ వెర్డే.. ఈ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో కేప్ వెర్డె ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూ ప్ హెచ్ టాపర్‌గా స్పెయిన్ ఏడు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్‌కు చేరగా.. కేప్ వెర్డే రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌లో అడుగుపెట్టింది. కాగా నాకౌట్ దశలో కేప్ వెర్డేకు అర్జెంటీనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది.