15 June, 2026 | 6:27 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

సత్తుపల్లిలో సవాళ్ల జోరు

03-02-2025 12:41 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల అరెస్ట్ 

ఖమ్మం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో సత్తుపల్లి, వేంసూరులో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. శనివారం సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.

దీంతో ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేందుకు బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇతర నాయకులు బయలుదేరుతుండగా ముందస్తుగా పోలీసులు వారిని ఇళ్ల వద్దనే అరెస్ట్ చేసి, వేంసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసి, సత్తుపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు సవాల్ చేస్తేనే వచ్చామని, బీఆర్‌ఎస్ లీడర్ల అరెస్ట్ సరికాదన్నారు.