15 June, 2026 | 6:33 PM

Breaking News

ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •  

ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు

15-06-2026 05:41 PM

* పండగల ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తొలి పునాది అంగన్వాడి కేంద్రాలని అంగన్వాడి టీచర్ పోకల వెంకమ్మ అన్నారు. మండలంలోని గానుగుబండ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం ఉత్సవ పూరిత వాతావరణంలో మామిడి తోరణాల మధ్య పండగ వాతావరణంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాలు పిల్లల ఎదుగుదలకు తొలిమెట్టని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు చదువుతోపాటు ఆట, పాటలు, వారి ఆరోగ్యానికి కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. అర్హులైన తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఆమె కోరారు.