calender_icon.png 19 January, 2026 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చల్మెడ

19-01-2026 12:23:10 AM

వేములవాడ, జనవరి 18,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలం,రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చల్మెడవేములవాడ అర్బన్ మండలంలోని కొడుముంజ గ్రామంలో ఉన్న రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ వేడుకలకు బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శించుకున్నారు.చల్మెడ వెంట సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, గ్రామ సర్పంచ్ కదిరి రాజు, ఉప సర్పంచ్ వేముల నాగరాజు, వైస్ ఎంపీపీ రవిచంద్రరావు, గోట్ల కుమార్, నాయిని రవి, మంత్రి రాజేశం, తిరుపతి, అక్షరాములు, వెంకటసాయి, ఆదిత్య, ప్రమోద్, కార్తీక్, మల్లేశం, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొని, కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది.