13 March, 2026 | 4:58 AM

రాహుల్ గాంధీ స్ట్రాటజీ కన్సలెంటా!

13-03-2026 01:10 AM
  1. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

లోక్‌సభ ప్రచురించిన ఎంపీల ఫ్రొఫైల్ చూసి కొండా ఆశ్చర్యం 

పార్లమెంట్ కెఫెటేరియాలో సరదా చర్చ

‘హూస్ హూ’ పుస్తకం

న్యూఢిల్లీ, మార్చి 12: లోక్‌సభ ప్రచురించిన ‘హూస్ హూ’ పుస్తకంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఫ్రొఫైల్ చూ సి ఎంపీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆశ్చర్యపోయారు. గురువారం పార్లమెంట్ విరామ సమయంలో ఈ పుస్తకాన్ని పరిశీలించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీ తన ప్రొఫెషన్‌ను ‘స్ట్రాటజీ కన్సల్టెంట్’గా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయినట్లు ట్వీట్ చేశారు.

ఎంపీలు స్వయంగా ఇచ్చిన సమాచారం ఆధారంగానే వారి వి ద్యా, వృత్తిగత నేపథ్యాలతో ఈ పుస్తకం రూపొందుతుంది.పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత, వృత్తి వివరాలతో కూడిన ‘హూస్’ హూ’ పుస్తకంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రొఫెషన్ చూసి ఆశ్చర్యపోయినట్లు  విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. పార్లమెంట్ స మావేశాల విరామ సమయంలో తోటి ఎం పీలతో కలిసి ఈ పుస్తకాన్ని పరిశీలిస్తూ ఆ యన పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇ ప్పుడు వైరల్ అవుతున్నాయి. లోక్‌సభ స మావేశాలు జరుగుతున్న సమయంలో సభ కాసేపు వాయిదా పడటంతో..

ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు తదితరులు పార్లమెంట్ కెఫెటేరియాలో టీ తాగేందుకు వెళ్లారు.ఆ సమయంలో లోక్‌సభ సచివాలయం తమకు కాంప్లిమెంటరీగా అందించిన ‘హూస్’ హూ’పుస్తకాన్ని ఎంపీ కొండా తిరిగేశారు. అందులో ఎంపీల విద్యా అర్హతలు, వృత్తి, గత నేపథ్యం, వారి ఆసక్తుల వివరాలు పొందుపరిచారు.ఆ పుస్తకంలో తన వివరాలను చూసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

తన వృత్తి ’ఇంజనీర్’ అని సరిగ్గా పేర్కొనడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సహచర ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరుల ప్రొఫైల్ చూశారు. ఆ తర్వాత రా హుల్ గాంధీ ప్రొఫైల్ను చూసిన ఆయన కా స్త ఆశ్చర్యానికి గురయ్యారు. రాహుల్ గాంధీ తన వృత్తిని ’స్ట్రాటజీ కన్సల్టెంట్’గా బుక్లో పొందుపరిచారు. కాగా రాహుల్‌గాంధీ రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో మేనేజ్మెం ట్ కన్సల్టింగ్ రంగంలో పనిచేసినట్లు తెలిసింది.