చంపై సొరేన్ కొత్తపార్టీ?
22-08-2024 12:17 AM
రాంచీ, ఆగస్టు 21: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మాజీ నేత చంపై సొరేన్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. సీఎం పదవి నుంచి అవమానకరంగా దించేశారని భావిస్తున్న ఆయన జేఎంఎంకు దూరం జరిగారు. రెండు రోజుల క్రితం ముగ్గురు జేఎంఎం ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లటంలో ఆయన బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టనున్నట్టు సంకేతాలిచ్చారు. ‘ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం. నా అనుచరుల మద్దతు, ప్రేమ లభించినంతకాలం నేను రాజకీయాలను వదిలేయను. ఒక అధ్యాయం ముగిసింది. నేను ఓ కొత్త సంస్థను ప్రారంభించవచ్చు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నారని ప్రచారం జరుగుతున్నది. త్వరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.






