విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్
ప్రతి రింగ్‌పై ట్రోఫీ, జట్టు ప్రత్యేక డిజైన్
మొత్తం 2,026 రింగ్స్ మాత్రమే తయారీ
అభిమానుల కోసం 1,996 రింగ్స్
న్యూయార్క్, జూలై 17 : సాకర్ ప్రపంచకప్ విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. అయితే ఈ సారి ఫిఫా ప్ర పంచకప్ గెలిచిన జట్టుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన జట్టు ప్లేయర్స్‌కు ప్రత్యేకమైన బహుమతి లభించనుంది.
ఫైనల్లో విజయం సాధించిన జట్టుకు ట్రోఫీ, గోల్ మెడల్స్‌తో పాటు ప్రత్యేకమైన ఛాంపియన్ షిప్ రింగ్స్ అందజేయనున్నారు. ఈ మేరకు ఫిఫా అధికారికంగా ప్రకటన చేసింది. అమెరికా క్రీడల్లో ఇది సహజంగా కనిపిస్తుంటుం ది. కానీ తొలిసారి అంతర్జాతీయ ఫుట్ బాల్ లో ప్రవేశపెడుతున్నారు. ట్రోఫీ అందజేసే వేదికపైనే విన్నింగ్ టీమ్ కోచ్, కెప్టెన్ తో పాటు ఆటగాళ్లందరికీ ఈ రింగ్స్ బహుకరించనున్నారు. ఈ రింగ్స్ ను ఫిఫా అత్యంత ప్రత్యేకంగా తయా రు చేయించింది.
ప్రతీ ఉంగరంపై వరల్ కప్ ట్రోఫీ చిత్రం, విజేతగా నిలిచిన జట్టు ప్రాతినిథ్యం కనిపించేలా ప్రత్యేక డిజైన్ ఉం టుంది. అలాగే ప్రతీ రింగ్ కు ఒక ప్రత్యేక నెంబర్, ప్రామాణికతను ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు. కాగా ఫిఫా ప్రపంచకప్ ప్రస్తుత ఎడిషన్ ను గుర్తుండేలా మొత్తం 2026 రింగ్స్ మాత్రమే తయారు చేయించారు. వీటిలో 30 ఉంగరాలను ట్రోఫీ గెలిచిన జట్టుకు బహుకరించనుండగా.. మిగిలిన 1996 ఉంగరాలను అభి మానులకు విక్రయించనున్నారు. వీటిని అధికారిక లైసెన్స్‌డ్ ఉత్పత్తులుగా ఫిఫా వెబ్‌సైట్‌లో ఉంచి విక్రయించనున్నట్టు అధికారులు తెలిపారు.






