calender_icon.png 18 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రుని సన్నిధిలో ఘనంగా చండీ హోమం

18-02-2026 12:51:58 AM

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రతి నెల అమావాస్య రోజున శ్రీ వీరభద్ర స్వామి భస్మాభిషేకము, అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి విశేషంగా రుద్ర సహిత చండీహోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈనెల మంగళవారం రావడం వల్ల మంగళ చండికగా కొలవడం జరిగింది.

ఎవరైతే భక్తులు హోమంలో పాల్గొంటారో ము ఖ్యంగా శత్రు, రోగ, రుణాల నుండి విముక్తులు అవుతారని మార్కండేయ పురాణంలో చెప్పిన విధంగా సప్తశతి హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణాధికారి పి కిషన్ రావు అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తదనంతరం అన్నదానం నిర్వహించ డం జరిగింది.