calender_icon.png 18 February, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ డ్రా రూపంలో అదృష్టం

18-02-2026 12:54:10 AM

తొర్రూరు, జనగామలో చైర్మన్లను దక్కించుకున్న కాంగ్రెస్

మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగా మ, తొర్రూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల ఎన్నిక మంగళవారం జరిగింది. తొర్రూరులో 16 వార్డులు ఉండగా 9 బీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకోవ డానికి దరఖాస్తు చేసుకోవడంతో మున్సిపాలిటీలో ఇరు పార్టీలకు సమాన బలం చే కూరింది.

దీంతో బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫలితంగా ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసి, పెద్ద ఎత్తు న పోలీసులను మోహరించి, ఎర్రబెల్లి తో పాటు ఇతర నేతలను ఎక్కడికి అక్కడే నిలువరించి, తొర్రూరు మున్సిపాలిటీలో చైర్పర్స న్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం డ్రా పద్ధతి నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కి చెందిన రెండవ వార్డు కౌన్సిలర్ తూనం శ్రా వణ్ను అదృష్టం వరించింది. అలాగే వైస్ చై ర్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమ రజని డ్రా పద్ధతిలో విజయం అందుకున్నారు. 

జనగామలో 

జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 13 వార్డుల్లో బీఆర్‌ఎస్, 12 వార్డు ల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఎం, నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. 12 వార్డుల్లో గెలుపొందిన కాంగ్రెస్కు సీపీఎం నుంచి గెలుపొందిన కౌన్సిలర్ మద్దతు ఇవ్వ గా, స్వతంత్రుల్లో ఇద్దరూ మద్దతు ప్రకటించారు. దీనితో కాంగ్రెస్ బలం 15కు చేరింది. బీఆర్‌ఎస్కు ఇద్దరు స్వతంత్రులు మద్దతు తె లపడంతో వారి సంఖ్య కూడా 15కు చేరింది. సోమవారం జరిగిన ఉద్రిక్తల నడుమ ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య అటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ పార్టీ వార్డ్ కౌన్సిలర్లతో మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. మళ్లీ సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలమణిని అదృష్టం వరించి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్ పర్సన్గా బీఆర్‌ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలు డ్రా పద్ధతిలో ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలి టీలో 

కాంగ్రెస్ పార్టీకి చెందిన కుండేటి రాజకుమారి చైర్ పర్సన్ గా, ఇదే పార్టీకి చెందిన మాదా లావణ్య వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన తొమ్మిది మున్సిపాలిటీలతో మంగళవారం నిర్వహించిన మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికై క్లీన్ స్వీప్ చేశారు.