1 July, 2026 | 7:04 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

01-07-2026 05:55 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 1వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాసాని నాగేశ్వరరావు ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాగేశ్వరరావుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయనకు అండగా నిలిచి, పైస్థాయి నాయకులతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయ సహకారాలు అందించడంలో ఇల్లందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముద్రగడ వంశీ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.