మెరుగైన వైద్యం అందించాలి
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో బుధవారం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజూ 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, అధికారులు గోపాల్ సింగ్, రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






