calender_icon.png 22 August, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కృషి

05-08-2024 12:38:53 AM

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశంసించారు. ఆదివారం పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమర్‌నాథ్‌రెడ్డి కుటుంబానికి, తమకు ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉందని, అదే సంప్రదాయం ఇప్పుడు తాము కొనసాగిస్తామని తెలిపారు.

ఏపీలో కూటమికి ప్రజలు ఆఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. పోలవరం పూర్తయితే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.