23 March, 2026 | 2:01 AM

నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యేనా?

23-03-2026 12:25 AM
  1. ప్రధాన కార్పొరేషన్లపై నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం 
  2. ఇప్పుడు, అప్పుడు అంటూ సాగదీత
  3. నాలుగైదు పదవులు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఒక వాదన
  4. పార్టీ కోసం పని చేసిన వారికే ఇవ్వాలని మరో వాదన 
  5. సామాజిక న్యాయం పాటించాలని శ్రేణుల డిమాండ్ 

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): నామినేటెడ్ పదవులు ఆ శావాహులను ఊరిస్తూనే ఉన్నాయి. ఈ పండుగ, ఆ పండుగ తర్వాత భర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం, పార్టీ పెద్ద లు ఆశావాహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా పూర్తీస్థాయిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలో ఒకేసారి 37 వరకు నామినేటెడ్ పదవులు భర్తీచేశారు. ఆ తర్వాత కూడా ఐదారుగు రికి పదవులు ఇచ్చారు. ఇంకా కీలక కార్పొరేషన్లకు, వివిధ శాఖలకు డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొదటి విడతలో భర్తీచేసిన వారి ప దవీ కాలం కూడా పూర్తి కావస్తున్నది. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి పార్టీ ముఖ్యనేతలు ఇటీవలే పలు ద ఫాలుగా సమావేశమయ్యారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రే వంత్‌రెడ్డి తరఫున రాజ్యసభసభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సమావేశమై పదవుల భర్తీపై చర్చిస్తున్నారు. వివిధ కుల సంఘాల ఫెడరేషన్ల విషయం లో కొంతమేర తుది రూపం వచ్చినప్పటికీ కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్ల విషయంలో కొలిక్కి రావడం లేదని తెలిసింది. 

ప్రధాన పదవులపై కుదరని ఏకాభిప్రాయం

ప్రధానంగా ఆర్టీసీ, బెవరేజెస్, పు నరుత్పాదక శక్తి (రెడ్కో), టెక్స్‌టైల్స్, జనవనరుల అభివృద్ధి, విధ్య మౌలిక వసతుల సంస్థ, మూసీ రివర్‌ఫ్రంట్ తదితర కీలక కార్పొరేషన్ల చైర్మన్లు, మెంబర్ల నియమాకం విషయంలో నాయకుల మధ్య ఏక్రాభిప్రాయం కుదరడం లేదని పార్టీ వర్గాల్లోనే జో రుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రధాన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగించాలనే యోచనలో ప్రభు త్వం ఉన్నట్టు తెలుస్తున్నది.

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి, లేదంటే కాంగ్రెస్ కోసం పనిచేసే సీనియర్లకు అప్పగిస్తే బాగుంటుందని పార్టీ నుంచి సూచనలు చేసినట్టు స మాచారం. కొందరు సీనియర్ మం త్రులు మాత్రం తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

పదవులు నాయకుల అనుచరులకు కాకుండా పార్టీ కోసం పనిచేసేవారికి ఇస్తేనే శ్రే ణుల్లో నమ్మకం కలుగుతుందని గాం ధీభవన్ వర్గాలు వాదిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవుల్లో సామా జిక న్యాయం పాటించాలనే డిమాం డ్ కూడా వినిపిస్తున్నది. మొదటి విడతలో ఒకటి, రెండు సామాజికవర్గాల కు గంపగుత్తగా పదవులు కట్టబెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణలోనే ఫెడరేషన్లు

వివిధ కుల సంఘాల ఫెడరేషన్లకు కూడా పాలకవర్గాలను నియమించలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారుల పర్యక్షణలో నే నడుస్తున్నాయి. వీటిలో రజక సహకార సొసైటీ ఫెడరేషన్, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర, వాల్మీకి బోయ, క్రిష్ట బలిజ పూసల, భట్రాజులు, శాలివా హన (కుమ్మరి), విశ్వబ్రాహ్మణ, మేదరి, గీత పారిశ్రామిక సహకార ఫెడరేషన్ చైర్మన్, సభ్యుల నియామకాలు కూడా చేపట్టలేదు.

ఈ ఫెడరేషన్లలోని పదవు లు భర్తీ చేస్తే ఆయా కులాల నుంచి పార్టీపై, ప్రభుత్వంపై సానుకూల వాతావరణం కలుగుతుందనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు. ఈ పదవులకు పార్టీ ముఖ్య నేతల నుంచి సిఫారస్ లేఖలు తీసుకుని వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ సూచించినట్టు తెలిసింది.

వీటితోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల పూర్తి కార్యవర్గాన్ని కూడా నియమించాలని సూచించారు. ఇప్పటికే 14 జిల్లాలకు పూర్తి కార్యవర్గం ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పదవుల్లోనూ సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.