హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఎంతో ఉపయోగకరం
- మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్
మెగా హెల్ప్ క్యాంప్ కు విశేష స్పందన
శ్రీ సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్
అధిక సంఖ్యలో హాజరైన పేషెంట్లు
మంథని, మార్చి 22 (విజయక్రాంతి) మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకరమని, నిరుపేదలైన వారికి నిపుణులైన డాక్టర్లు పరీక్ష నిర్వహించి సేవలందించడంపై మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ వారి సహకారంతో మంథనిలో ఆదివారం ప్రారంభించిన మెగా హెల్త్ క్యాంపు లో విశేషంగా ఆదరణ లభించినట్లు ఆయన తెలిపారు. కొన్ని అనివార్య కారణాలవల్ల మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రాలేకపోయారని ఆయన తెలిపారు.
ప్రచోపకరమైన ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ఎక్కడ నిర్వహించినా తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి అన్నారు. అనంతరం శ్రీ సీతారామ సేవా సదన్ అధ్యక్షులు కేవీఎల్‌ఎన్ హరిబాబు మాట్లాడుతూ శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు నారాయణ గురూజీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ లో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యతో ఎందరో నిపుణులైన, విశేష ఆదరణ పొందిన డాక్టర్ల బృందం వారి సేవలందించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ మెగా హెల్ప్ క్యాంపులో అని రంగాల్లో ప్రత్యేకత గాంచిన వైద్య నిపుణులు డాక్టర్ బి సాయి ఫణి చంద్ర, డాక్టర్ డిడ్డి హరి ప్రకాష్, డాక్టర్ విశాల్ కుమార్ చితికేశి, డాక్టర్ నవ వికాస్ జూకంటి అండ్ టీం, డాక్టర్ శ్రీ వర్ధన్ జాస్తి, డాక్టర్ శ్వేత పెండ్యాల, డాక్టర్ రోషన్ కుమార్ జైస్వాల్, డాక్టర్ నవ్య శ్రీ యనిగళ్ళ, డాక్టర్ గల్లా రఘు కిషోర్, డాక్టర్ వెలుగులేటి సాయి స్నేహిత లు పాల్గొన్నారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానికత వీధిలో గల శ్రీ సీతారామ సేవా సదన్ వద్ద నిర్వహించనున్న ఈ ఉచిత మెగా క్యాంపు ను అందరూ సద్వినియోగం వినియోగించుకున్నారన్నారు. ఈ మెగా క్యాంపులో ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సదన్ నిర్వాహకులు కొల్లారపు శ్రీనివాస్, శ్రీరంభట్ల అంబరీష్, దుద్దిళ్ళ గణపతి, పల్లి ప్రహ్లాద్, మురళి తదితరులు పాల్గొన్నారు.




