calender_icon.png 8 October, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

08-10-2025 10:12:44 AM

హైదరాబాద్: తెలంగాణ టీటీపీ నేతలకు(Telangana TDP leaders) పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేమని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ మద్దతు అడిగితే కలిసి పనిచేయాలని.. లేదంటే తటస్థంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రం మద్దతిచ్చేది లేదని సీబీఎన్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీ(Telugu Desam Party) పట్ల అభిమానం ఉందని ఆయన పేర్కొన్నారు. జనంలో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(Jubilee Hills by-election) పోటీచేయరాదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని(Telangana State TDP President) ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు కోరారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించినట్లు నాయకులు చంద్రబాబుకు వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే, ఈ లోపు ముఖ్య నాయకులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. నేతల అభిప్రాయాలు చంద్రబాబు తీసుకున్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.