కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణం
- ఐటీ పార్క్‌లోని 12 ఎకరాల్లో కార్యక్రమం
- ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు కృష్ణా జిల్లా గన్నవ రం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని 12 ఎకరాల స్థలం ఎంపిక చేసినట్లు రాష్ట్ర రవాణా, ఆర్&బీ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. ఐజీలు రాజశే ఖర్‌బాబు, అశోక్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు , ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పోలీసు కమీషనర్ రామకృష్ణ, జేసీ గీతాంజలిశర్మ ఈ ప్రదేశాన్ని పరిశీలించారు.
ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. వేదిక, బారికే డింగ్, బ్లాక్‌ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగు అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాన సభాస్థలి, విమానాశ్రయం, ఐటీపార్కు, పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించిం ది. విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారుల బృందంతో రాష్ట్ర అదనపు కార్యదర్శి డీజీ ఎస్ బాగ్చి ఏర్పాట్లపై సమీక్షించారు.
12న ప్రమాణం
కేసరపల్లి ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రమా ణ స్వీకార సమయం మారిందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కు మార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.






