30 August, 2026 | 6:08 AM

ఈ సారైనా కిషన్‌జీ మార్క్ కనిపించేనా?

10-06-2024 12:33 AM
  • నిధుల కోసం నగరం ఎదురుచూపులు!
  • ఏడేండ్లుగా పిల్లర్లలోనే ఉప్పల్  నారపల్లి ఎలివేటెడ్ కారిడార్  
  • ఎంఎంటీఎస్ విస్తరణ పూర్తయ్యేనా 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర ప్రజ లకు పరిచయం అక్కర్లేని వ్యక్తి కిషన్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితమంతా హైదరాబా ద్ కేంద్రంగానే సాగుతోంది. బీజేపీలో అంచలంచెలుగా ఎదిగిన కిషన్‌రెడ్డి అదేస్థాయిల్లో ప్రజల్లోనూ అభిమానం చూరగొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగానే కాకుండా, రెండుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నగరాభివృ ద్ధిపై ప్రజలు పలు ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. కొత్తగా వచ్చే నిధులు, నగరాభివృద్ధిలో కిషన్‌రెడ్డి మార్క్‌పై రాజధాని వాసులు చర్చించుకున్నారు.  

పెండింగ్ ప్రాజెక్టులు.. 

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేసి న కిషన్‌రెడ్డి చొరవతో పర్యాటకంగా హైదరాబాద్ కొంత అభివృద్ధి జరిగిందనీ, ఈ సారి మరింతగా నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నా రు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టెర్మినల్ పనుల్లో వేగం పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఎంఎంటీఎస్ రైళ్లను యాదాద్రి దాకా విస్తరించాల్సిన పనులు మొదలైనా ముందుకు సాగడం లేదు. ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పిల్లర్లకే పరిమితమ య్యాయని, వాటిని పూర్తి చేసేలా కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.