2 September, 2026 | 12:27 AM

12న చంద్రబాబు ప్రమాణం

08-06-2024 | 01:43am

హైదరాబాద్ జూన్ 7 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు జూన్- 12న ఉదయం 11:27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మొదట మంగళగిరి ఎయిమ్స్ స్థలం బాగుంటుందని భావించినప్పటికీ, దీని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు.

ఢిల్లీ నుంచి చంద్రబాబు రాగానే సభా స్థలంపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ శ్రీకారం సభా స్థలాన్ని అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేశ్‌తోపాటు పలువురు నేతలు పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ, ఎన్డీఏ రాష్ట్రాల నేతలు, పలువురు ముఖ్యమంత్రులు రానున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.