3 September, 2026 | 6:46 AM

పండగల విశిష్టతను భావితరాలకు తెలపాలి: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

29-06-2025 | 07:28pm

అనంతగిరి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినా ఆదిదేవతల ఉప్పలమ్మ పండగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. ఆదివారం అనంతగిరి మండల కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు క్లాసర్ మిల్లులో జరిగిన ఉప్పలమ్మ పండగ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉప్పలమ్మ ఎల్లమ్మ మైసమ్మ పండగలతో పాటు గ్రామదేవతలు కొలిచే పండగలు పూర్వం నుంచి కొలిచే ఆచారాలు ప్రతివేట కొనసాగుతున్నాయన్నారు. వీరు ఆచరించి కొలిచే పవిత్రమైన ఉప్పలమ్మ దేవత కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడాలని దేవతను ప్రార్థించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు వేనేపల్లి సతీష్ వివిధ గ్రామాల సీనియర్ నాయకులు అభిమానులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.