15 March, 2026 | 6:31 AM

వాస్తు పిచ్చితో సచివాలయానికి మార్పులు

08-11-2024 12:54 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్‌తో దేశానికే తలమానికమైన కొత్త సచివాలయాన్ని గత సీఎం కేసీఆర్ నిర్మిస్తే  ప్రస్తుతం వాస్తు పిచ్చితో సీఎం రేవంత్‌రెడ్డి మార్పులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేవారు.ఇదే కాంగ్రెస్ అసలుసిసలైన మార్కు మార్పు అని ఎద్దేవా చేశారు.