31 May, 2026 | 1:02 AM

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో గందరగోళం

31-05-2026 12:00 AM
  1. మేడ్చల్ భారత్ గ్యాస్ ఏజెన్సీని ముట్టడించిన బీజేపీ నేతలు
  2. సామాన్యుడి బతుకు బండపై నల్లబజారు నీడ
  3. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై బీజేపీ గరం గరం
  4. బుకింగ్‌లు రద్దు.. డెలివరీ బాయ్స్ చేతివాటం 
  5. యాజమాన్యానికి బీజేపీ అల్టిమేటం

మేడ్చల్ అర్బన్ మే 30(విజయక్రాంతి): మేడ్చల్ ప్రాంతంలో భారత్ గ్యాస్ సిలిండర్ ల సరఫరాలో జరుగుతున్న గందరగోళంపై స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వినియోగదారుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన బీజేపీ నేతలు శనివారం మేడ్చల్‌లోని భారత్ గ్యాస్ ఏజెన్సీని సందర్శించి యాజమాన్యంతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్ లను సకాలంలో అర్హులైన వినియోగదారులకు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.వినియోగదారుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో రిపీటెడ్గా బుకింగ్లు రద్దు కావడంపై మండిపడ్డారు.కొంతమంది డెలివరీ ఏజెంట్ల చేతివాటం వల్ల సిలిండర్ లు సామాన్యులకు చేరడం లేదని వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.

సామాన్యుడి బతుకుబండగా మారిన గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకూడదని పంపిణీ విధానంలో తక్షణమే పారదర్శకత తీసుకురావాలి.వేగంగా సిలిండర్ ల పంపిణీ  ప్రజలకు మెరుగైన సేవలు అందించడం సంస్థ ప్రాథమిక బాధ్యత అని తెలిపారు.

సరఫరా లోపాలను తక్షణమే సరిదిద్దకపోతే ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు బాధితులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు జాకట ప్రేమ్ దాస్.చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్.బండి విష్ణు గౌడ్.వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.