31 May, 2026 | 12:17 AM

నార్సింగిలో హైడ్రా భారీ ఆపరేషన్

31-05-2026 12:00 AM
  1. రూ.5500 కోట్ల విలువ చేసే 34.21 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..
  2. పేదల పేరుతో గుడిసెలు వేసి కబ్జాకు ప్రయత్నించిన రియల్టర్లు, బడా వ్యాపార వేత్తలు, నిర్మాణ సంస్థలు.. 
  3. చెరువు చుట్టూ కంచె వేసిన హైడ్రా అధికారులు..
  4. సీఎస్‌ఆర్ నిధుల నుంచి చెరువు అభివృద్ధి చేస్తున్న తత్వ సంస్థ.. 
  5. స్థానికుల ఫిర్యాదుతో చర్యలకు పూనుకున్న హైడ్రా..

రాజేంద్ర నగర్, మే 30 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఐటి కారిడార్ కు అతి సమీపంలోని పుప్పాల నార్సింగ్ గ్రామాల పరిధిలో హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ చేపట్టింది . నార్సింగి పరిధిలోని ముస్కాన్ చెరువు లో 34 .2 ఎకరాల్లో వెలసిన కబ్జాల ను తొలగించి అట్టి భూమిని కాపాడి 5500 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా  కంచె ఏర్పాటు చేశారు.

హెచ్‌ఎండిఏ లెక్కల ప్రకారం 52.20 ఎకరాల ముస్కాన్  చెరువు మధ్యలో నుంచి కట్ట నిర్మించి 34 .21 ఎకరాల ప్రభుత్వ భూమిని బడా రియల్టర్లు వ్యాపారవేత్తలు కబ్జాలకు పాల్పడ్డారు పేదల తో గుడిసెలు వేయించి కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నరని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలకు రంగం సిద్ధం చేశారు

సి ఎస్ ఆర్ నిధులతో చెరువు లో తత్వ సంస్థ పనులకు శ్రీకారం చుట్టింది అయితే ఆ సంస్థ ఈ పనులను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సదరు వ్యక్తులు చెరువు కబ్జాకు పక్కా ప్లాన్ వేసుకుని పెద్ద ఎత్తున పేదలను అక్కడికి దించి గుడిసెలు వేశారు స్థానికుల పిర్యాదు తో గత 2 నెలల క్రితమే హైడ్రా అధికారులు కబ్జాల దగ్గరకి వెళ్లి అక్కడ గుడిసెలు వేసిన వారికి ఇక్కడి నుండి స్వచ్ఛందంగా  గుడిసెలు కాలి చెయ్యాలని సూచించారు . హెచ్‌ఎండిఏ ప్రకారం చెరువు ఎఫ్ టి ఎల్ 52.20 ఎకరాల్లో ఉనది ఇందులో 20 .23  ఎకరాల్లో శిఖం భూమి ఉంది మిగతాది అంతకూడా ఎక్సల్ పట్టభూమి .

ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధన ఉన్నప్పటికీ  కొందరు భారీగా నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా అధికారుల ముందస్తు ఆదేశాల మేరకు శనివారం ముస్కాన్ చెరువులో హైడ్రా చేపట్టిన ఆపరేషన్ తో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు స్వచ్ఛందంగా ఇండ్లు ఖాళీ చేసి అక్కడినుండి వెళ్ళిపోయారు.

అనంతరం చెరువు ఎఫ్ టి ఎల్ భూమికి హైడ్రాధికారులు కంచ వేశారు ఈ సందర్భంగా హైడ్రాధికారులు మాట్లాడుతూ ముస్కాన్ చెరువులో కబ్జాలకు పాల్పడిన వారిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ప్రభుత్వ స్థలాలను . చెరువులను కబ్జా చేయాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టం అని హెచ్చరించారు.