5 August, 2026 | 2:28 PM

రాహుల్ ర్యాలీలో గందరగోళం!

20-05-2024 12:48 AM

యూపీ ఫుల్పూర్‌లోని పడిలా ప్రాంతంలో బహిరంగ సభ 

భారీస్థాయిలో హాజరైన కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు

బారికేడ్లు తోసుకుని సభ వద్దకు వచ్చిన జనం

అదుపు చేయలేక చేతులెత్తేసిన పోలీసులు

ప్రసంగించకుండానే వెనుదిరిగిన రాహుల్, అఖిలేశ్

ప్రయాగ్‌రాజ్, మే 19: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతలు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ర్యాలీ నిర్వహించారు. పడి లా ప్రాంతంలో ఇద్దరు నేతలు కలిసి సం యుక్తంగా ఎన్నికల సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు హాజరయ్యారు.

అయితే రాహుల్‌ను చూసేందుకు కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట లాంటి పరి స్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను విరగ్గొట్టారు. స్టేజీ ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ స్టేజీ వద్దకు వచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు చేసి న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు కూడా చేతులెత్తేశారు. ప్రశాంతంగా ఉండాలని ఎంత కోరినా ఫలితం లేకుండాపో యింది. ఇక చేసేదేం లేక రాహుల్ గాం ధీ, అఖిలేశ్ యాదవ్ అక్కడ ప్రసంగించకుండానే స్టేజీ దిగి వెళ్లిపోయారు.