02-12-2025 05:49:55 PM
మా ఓటును అమ్మేది లేదంటూ ఫ్లెక్సీ లతో ఇన్ స్పెయర్ యూత్ వినూత్న నిరసన..
రేగొండ (విజయక్రాంతి): సర్పంచ్ అభ్యర్థులకు కోతుల బెడద పట్టుకుంది. గ్రామాల్లో ఓటర్ల కంటే కోతుల సంఖ్య ఎక్కువ ఉండడంతో వాటి బారినపడి గాయాల పాలైన బాధితులు చాలామందే ఉన్నారు. దీంతో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులను కోతులను తరిమికొడితేనే ఓట్లు అడగాలంటూ వినూత్న పద్ధతుల్లో వారి నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రేగొండ మండల కేంద్రానికి చెందిన ఇన్ స్పెయిర్ యూత్ అసోసియేషన్ కమిటీకి చెందిన యూత్ నాయకులు ఫ్లెక్సీలతో మా ఓటును అమ్మేది లేదు.
కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి. అంటూ వినూత్న పద్ధతిలో తమ యూత్ తరఫున నిరసనను వ్యక్తం చేశారు. అలాగే వజ్రాయుధం లాంటి ఓటుతో గ్రామ అభివృద్ధికి బాటలు వేద్దాం ఊరంతా దాడుల్లో గాయాలైన బాధితులే అని ఇలా ఫ్లెక్సీలను తయారుచేసి మండల కేంద్రంలోని పలుచోట్ల గోడలకు వాటిని పెట్టి వారి నిరసనను వ్యక్తం చేశారు. పోతులను తరిమి ఎన్నికకు ముందే అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు.