calender_icon.png 15 June, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగువేరా అంటే యువతకు ఆదర్శం..

14-06-2025 07:15:16 PM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్..

అదిలాబాద్ (విజయక్రాంతి): చేగువేరా(Che Guevara) అంటేనే విప్లవ నిప్పుకణిక, యువతరానికి ఐకాన్, నేటీ యువత టీ షర్ట్ పైన, బైక్ ల పైన, కార్ల పైన అయన ఫోటోలు వేసుకొని స్ఫూర్తి పొందుతున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం అని పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో చేగువేరా 97వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ... మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను తుదముట్టించాలని ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలని విప్లవోద్యమంలోకి అడుగు పెట్టాడని గుర్తు చేశారు.

క్యూబ విప్లవ పోరాటంలో ఫెడల్ క్యాస్ట్రో రాహుల్ క్యాస్ట్రో లతో కలిసి నాయకత్వం వహించి విప్లవాన్ని సాధించారన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా, జాతీయ ప్రణాళికా సంఘం అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన చేగువేరా కు ఏదీ తృప్తిని ఇవ్వలేదన్నారు. ఈ పదవులు అన్నింటినీ త్యాగం చేసి బొలియా విప్లవోద్యమంలోనూ పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, బొజ్జ ఆశన్న, సురేందర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి,  తదితరులు పాల్గొన్నారు.