కొత్త రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
ఎమ్మార్వో బి. రామకృష్ణారెడ్డి..
మునగాల: కొత్త రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అని ఎమ్మార్వో బి. రామకృష్ణారెడ్డి(MRO B. Ramakrishna Reddy) అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఈ వానాకాలం సీజన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సహాయ పథకం అయిన రైతు భరోసా పథకానికి కొత్త రైతులు ఈ నెల 05 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు గతంలో పట్టాదారు పాస్ పుస్తకం వచ్చి ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేయని రైతులు ఎవరైనా ఉంటే వారు ఈ రైతు భరోసా పథకం కోసం ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో రైతుబంధు/రైతు భరోసా పథకం పొందుతున్న రైతులు ఎవరైనా వారి బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలి అనుకుంటే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు భరోసా దరఖాస్తు తేదీ. 20. లోగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లకు దరఖాస్తు ఫారం అందించాలి అన్నారు.






