06-12-2025 12:39:02 AM
-ఎవరి దిమా వారిది.. గెలుపు ఎవరిది?
-జన ఆదరణ ఉన్న నేతల వైపు ఓటర్ల చూపు
-ముగిసిన మూడవ విడత నామినేషన్ల పర్వం
-నేటి నుంచి ఊపందుకొనున్న ప్రచారం
హన్వాడ, డిసెంబర్ 5 : పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు సై అంటే సై అనేలా సమర శంఖం మోగిస్తున్నారు. తమది గెలుపు అంటే తమది గెలుపు అని ప్రచారం చేసుకుంటూ ఓటరులను ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితిలో నెలకొనేస్తాయికి చేరుకుంటున్నా యి. మూడు విడుదల నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచార పర్వంలో అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా మునిగిపోయింది.
పట్టణాల్లో ఉన్న నేతల సైతం గ్రామాలకు చేరుకొని వారికి సంబంధించిన అభ్యర్థులను బలపరుస్తూ ఎలాగైనా గెలుపు దిశగా ఉన్న వ్యక్తులకు మద్దతు తెలియజేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆలోచన తో ప్రజల సైతం అటువైపే ఉండేందుకు ముగ్గు చూపడం విశేషం. మరి కొందరు గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటా రా? మరో ఎన్నికలకే కనిపిస్తారా? అనే ఆలోచనను ఓటర్లు ఆలోచిస్తున్నారు.
నిండుగా పల్లెలు..
పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో జరగడంతో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పల్లెలకు చేరుకుంటున్నారు. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికలు ఇప్పటినుంచే మద్దతు ధరలను కూడగట్టుకుని గెలుపు తమ వారినే గెలిపిం చుకోవాలని సంకల్పంతో ఎవరికి వా రు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో పల్లెలలో ఓటర్లతో ప్రజలతో నిండుగా కొలువుతీరాయి. ఏమై నా ఎన్నికలు ఉండడంతో పల్లెల్లో నిండుగా జనం దర్శనమిస్తున్నారు. ఎటువైపు చూసిన జనం తో పల్లెలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
ప్రధాన పార్టీలు సైతం పల్లె వైపు..
అధికార పార్టీతో పాటు ప్రధాన పార్టీల నేతలు పల్లె వైపు చూస్తున్నారు. అత్యధిక సర్పంచ్లను గెలిపించుకుని భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు సర్పంచ్ల ద్వారా మరింత పట్టు సాధించాలని సంకల్పంతో కూడా ఆ యా పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు సర్పంచ్ అభ్యర్థుల్లో ప్రయోజనాలు దూరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పార్టీకి పట్టుకొమ్మల్లా సర్పంచ్ మద్దతుదారులతో మేలు జరుగుతుందని ఆయా పార్టీల నేతలు ప్రత్యేకంగా చర్చించుకోవడం విశేషం. దీంతో ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ అభ్యర్థులకు ఆయా పార్టీలు అండగా నిలుస్తున్నాయి.