calender_icon.png 6 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హవాలా నగదు 4 కోట్లు స్వాధీనం

06-12-2025 12:38:02 AM

  1. పోలీసులను చూసి పరారైన నిందితులు
  2. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
  3. శామీర్‌పేట ఔటర్‌పై ఘటన

శామీర్ పేట్, డిసెంబర్ 5(విజయక్రాంతి): శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై రూ.4 కోట్ల హవాలా నగదును శుక్రవారం బోయినపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో కలకలం రేగింది. పోలీసులను చూసి కారులో పారిపోతున్న నిందితులను చేజ్ చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గత కొద్ది సంవత్సరాల క్రితం 2024లో కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులను బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు పట్టుకొని వారిపై పక్కా నిఘా పెట్టారు.

ముంబై గుజరాత్ నుంచి కోట్ల రూపాయల హవాలా డబ్బు వస్తున్నాయని పక్కా సమాచారం అందడంతో శుక్ర వారం పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాపు కాశారు. నిజామాబాద్ నుంచి వస్తున్న హవాలా డబ్బును పట్టుకునే ప్రయత్నంలో పోలీసులను చూసి నిందితులను పరారయ్యారు. పోలీసులు చేజ్ చేసి మరీ నింది తులను పట్టుకున్నారు.

నిందితులు పాత ప ది రూపాయలు నోట్ కోడ్ ఆధారంగా 4 కో ట్ల 5 లక్షల రూపాయల హవాలా నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈత నిఖీలలో సుమారు 4కోట్ల 5లక్షల హవాలా డబ్బుల సంచులు లభించగా, ఇద్దరు నిందితులు, కారును స్వాధీనం చేసుకుని కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.