calender_icon.png 4 October, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ క్లియరింగ్ ఇక గంటల్లోనే..

04-10-2025 02:17:08 AM

న్యూఢిల్లీ: చెక్ క్లియరింగ్ సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా( ఆర్‌బీఐ) తగ్గించేసింది. శనివా రం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఆర్‌బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. దీంతో చెక్ డిపాజిట్ చేసిన గంటల్లోనే క్లియర్ అవుతుంది. ఈ కొత్త విధానంలో బ్యాంకు పని వేళల్లో చెక్ స్కానింగ్, డిపాజిట్, క్లియరింగ్ వంటి పనులన్నీ నిరంతరాయంగా సాగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు డిపాజిట్ చే స్తే.. సాయంత్రం 7 గంటల వరకు క్లి యర్ అవుతాయి. సంబంధిత చెక్కు ను ఆమోదించడం లేద తిరస్కరించడం ఏదైనా సరే సాయంత్రం 7 గంటలకల్లా జరిగిపోవాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.