04-10-2025 02:15:49 AM
చెన్నై, అక్టోబర్ 3: తమిళనాడులోని కరూర్‌లో ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) కార్నర్ మీటింగ్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టేందుకు ఐపీఎస్ అధి కారి అస్రా గార్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యా ప్త బృందాన్ని (సిట్) నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఒక పిటిషన్, తమ పార్టీ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టీవీకే మరో పిటిషన్ వేసింది.
ఈ రెండింటితో పాటు కరూర్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సముచితం కాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. తొక్కిసలాట జరిగినప్పుడు టీవీకే నేతలు ఘటనా స్థలం నుంచి పారిపోయారన, అది వారి మానసిక స్థితిని తెలియజేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
సభ నిర్వహించడంలో టీవీకే పూర్తిగా విఫలమైందని మండిపడింది. తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్‌లో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు వంటి ప్రా థమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం చింది.
ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ సమాధానమిస్తూ.. ‘విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుంది. అప్పటి దాకా రాష్ట్రప్రభుత్వం ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అను మతి ఇవ్వదు’ అని స్పష్టం చేశారు.
అలాగే రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసుశాఖను ధర్మాసనం నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, బాధితులకు పరిహారం పెంపు పిటిషన్‌కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీశ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించ డంలో పార్టీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది.
తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందన కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాటపై ఇటీవల టీవీకే అధినేత విజయ్ ‘నన్ను ఏదైనా చేయండి. కానీ, ప్రజల జోలికి వెళ్లొద్దు’ అంటూ సీఎం స్టాలిన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ గట్టిగా స్పందించింది. సినిమా ల్లో మాదిరిగానే నిజ జీవితంలో కూ డా విజయ్ నటన విఫలమైందంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించిందని, విజయ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడాన్ని త ప్పుబట్టారు.