4 July, 2026 | 10:32 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎసీబీ వలలో చర్లపల్లి డివిజన్ ఏఈ

17-06-2025 08:00 PM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారులపై అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) ఓ వైపు ఉక్కుపాదం మోపుతోంది. అయిన ప్రభుత్వ అధికారులో మార్పురావడం లేదు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని కొందరూ ప్రభుత్వ అధికారులు లంచం తీసుకున్నట్లు సమాచారం వస్తే చాలు ఏసీబీ అక్కడ వాలిపోయి అధికారుల భరతం పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్లపల్లి డివిజన్ లోని అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ-ఎలక్ట్రికల్ విభాగం)లో విధులు నిర్వహిస్తున్న స్వరూప చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన గుత్తేదారుడైన రాంరెడ్డి కోరారు.

చెల్లించే రూ.28 లక్షల బిల్లులకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి రూ.1.20 లక్షలు ఇవ్వాలని గుత్తేదారు రాంరెడ్డిపై ఒత్తిడి చేసింది. దీంతో చేసేదేమిలే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారుల ముందస్తు ప్రణాళిక ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఇచ్చిన లంచాన్ని స్వాధీనం చేసుకొని ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో కూడా కాంట్రాక్టర్లను లంచాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు స్వరూపపై ఆరోపణలున్నాయి.